సుండుపల్లె మండలంలో తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎంపీడీఓ రామచంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని జి. రెడ్డివారిపల్లె, ముడుంపాడు పంచాయతీల సర్పంచులతో కలిసి శనివారం వివిధ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్య ఎక్కువ ఉన్న గ్రామాలను గుర్తించి అక్కడ తాగునీటి వనరులపై పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూఎస్ ఏ ఈ ప్రసాద్, జి. రెడ్డివారిపల్లె సర్పంచ్ ఆకుల శ్రీనివాసులు, ముడుంపాడు మాజీ సర్పంచ్ రామస్వామి రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa