ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కౌలు రైతులకు కూడా మా ప్రభుత్వం అన్ని పథకాలు ఇస్తోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 25, 2022, 12:05 PM

రైతు భరోసా యాత్ర పేరుతో తిరుగుతున్న పవన్‌కళ్యాణ్‌ నిన్న చింతలపూడిలో సుదీర్ఘ ప్రసంగం చేసి, జగన్‌గారిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా దత్తపుత్రుడు అనే సినిమా తీయాలని ఉంద‌ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో రైతులకు అన్యాయం జరిగినా ఏనాడూ వారి తరపున మాట్లాడలేదు. రైతుల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి, ఎగ్గొట్టినా పవన్‌కళ్యాణ్‌ నోరెత్తలేదు.


కానీ రైతుల పక్షపాతి అయిన జగన్‌గారు, వారి కోసం ఎన్నో చేస్తున్నా పవన్‌కళ్యాణ్‌ విమర్శలు చేస్తున్నారు. కౌలు రైతులకు కూడా మా ప్రభుత్వం అన్ని పథకాలు ఇస్తోంది. పెట్టుబడి సాయం రూ.13,500 చొప్పున కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతులకు కూడా ఇస్తున్నాం. అలాగే ఉచిత పంటల బీమా, ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్నాం అని తెలియచేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com