ఐపీఎల్‌లో తన 200వ మ్యాచ్‌ను చెన్నైతో ఆడిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శిఖర్ ధావన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో 6000 పరుగుల మార్కును దాటాడు. విరాట్ కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా ధావన్ నిలిచాడు. ఐపీఎల్-2022 సీజన్‌లో ధావన్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి, 214 పరుగులు చేశాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో అభిమానులు గబ్బర్‌గా పిలుచుకునే శిఖర్ ధావన్ చెలరేగి ఆడాడు. 88 పరుగులుతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా ధావన్ ట్వంటీ 20 క్రికెట్‌లో 9000 పరుగుల మార్కును కూడా అధిగమించాడు. కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన మూడవ భారతీయుడు అయ్యాడు.
ధావన్ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 675 బౌండరీలు సాధించాడు. అతను ఐపీఎల్‌లో మొత్తం 45 అర్ధశతకాలు నమోదు చేశాడు. ఈ జాబితాలో అతడి కంటే ముందు స్థానంలో వార్నర్ ఉన్నాడు. వార్నర్ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 52 అర్థ శతకాలు నమోదు చేసి, అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక తన ఫామ్‌తో సెలెక్టర్లకు తాను రేసులోనే ఉన్నానని శిఖర్ ధావన్ సంకేతాలిచ్చాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లో ఆడాలని శిఖర్ భావిస్తున్నాడు. అయితే సెలెక్టర్ల ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa