ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణం.. ఐదేళ్ల కుమార్తెపై కన్నతండ్రి అత్యాచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 26, 2022, 12:00 PM

కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచాల్సిన ఓ తండ్రి సొంత కుమార్తెనే కాటేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి, కూతురిపై తరచూ అత్యాచారం చేశాడు. వావీవరసలు పట్టించుకోకుండా, చిన్నపిల్ల అని కూడా చూడకుండా దారుణానికి ఒడిగట్టాడు. కుమార్తె ఇబ్బందిపై తల్లి నిఘా పెట్టగా నిందితుడి దురాగతం బట్టబయలైంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడికి చెందిన నిందితుడికి 2016లో వివాహమైంది. ఈ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. నిందితుడు చిలకలూరిపేటలో వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల కాలంలో ఆ చిన్నారికి తల్లి స్నానం చేయించే సమయంలో తన ఇబ్బందిని చెప్పింది. నాన్న వద్ద పడుకోనని, తనకు మర్మాంగం వద్ద నొప్పి వస్తుందని తల్లికి తెలిపింది. దీనిపై ఆ తల్లికి అనుమానం వచ్చింది. తన భర్తపై నిఘా పెట్టాలని నిశ్చయించుకుంది. ఆదివారం రాత్రి పడుకున్నట్లు నటించింది.


ఆ రోజు రాత్రి 11 గంటలకు వచ్చిన నిందితుడు భార్యాపిల్లలు పడుకున్నారా లేదా అని నిర్ధారించుకున్నాడు. సెల్ ఫోన్ లైట్ వేసి పరిశీలించాడు. అనంతరం కుమార్తె పక్కన పడుకుని పోర్న్ వీడియోలు చూడడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే కుమార్తెపై అత్యాచారయత్నం చేయడానికి సిద్ధమయ్యాడు. దీంతో అతడి భార్య వెంటనే అతడిపై విరుచుకుపడింది. బంధువులు అందరికీ ఫోన్ చేసి అర్ధరాత్రి రప్పించింది. భర్త చేసిన దారుణాన్ని అందరికీ వెల్లడించింది. చివరికి చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com