జగనన్న ఇళ్ల పట్టాల పంపిణి చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమమని గృహనిర్మాణ శాఖమాత్యులు జోగి రమేష్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన సర్క్యూట్ హౌస్ లో మాట్లాడుతూ జిల్లాలో పట్టణ పరిధిలో మొత్తం ఒక లక్ష ఇళ్ల స్థలాలు, గ్రామీణ ప్రాంతాల్లో 1, 79, 000 ఇళ్ల స్థలాలకు ముఖ్యమంత్రి ఈ నెల 28న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం గ్రామంలో శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ముప్పై ఒక లక్షల ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తూ ఇళ్ళు కట్టించే కార్యక్రమం ముఖ్యమంత్రి చేపట్టారని తెలిపారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి అన్నారు. అనంతరం పరిశ్రమల శాఖా మాత్యులు గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిచే సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో మొత్తం 300 ఎకరాలలో లేఔట్ వేసి భారీ ఎత్తున పట్టాల పంపిణీ జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 75 లేఔట్లకు గాను సుమారు ఐదు వేల ఎకరాలు సేకరించడం జరిగిందని తెలిపారు. పేదవాడి సొంతింటి కళ నెరవేర్చడం ముఖ్యమంత్రి గారి ద్యేయమని పేర్కొన్నారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు రాజన్న దొర, పరిశ్రమల శాఖ మంత్రి అమరనాధ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీ ఎం వి వి సత్యనారాయణ, ఎం. ఎల్. ఏ అవంతి శ్రీనివాసరావు, ఎం. ఎల్. సి వరుదు కల్యాణి, జీవీఎంసీ కమీషనర్ లక్ష్మీషా, జేసీ విశ్వనాధం, అనకాపల్లి జేసీ కల్పనా కుమారి పాల్గొన్నారు.