ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్బూజా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 12:28 PM

కర్బూజాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- కర్బూజా వేసవి తాపాన్ని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తుంది.
- మూత్రపిండాలను శుద్ధి చేస్తుంది. రాళ్లు ఏర్పడకుండా సంరక్షిస్తుంది.
- గర్భిణులలో అదనంగా చేరే సోడియంను తొలగించడంలో సాయపడుతుంది.
- కర్బూజాలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మంచి పోషకాహారం.
- కర్బూజా జుట్టును దృఢంగా ఉంచి రాలిపోకుండా కాపాడుతుంది.
- కర్బూజాలో ఉన్న పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.
- కర్బూజాలో ఉండే పీచుపదార్థాలు జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తాయి.
- కర్బూజాలో సి-విటమిన్‌ తగినంత ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- కర్బూజాలో ఉన్న ఎ-విటమిన్‌ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
- స్త్రీలలో ఎక్కువగా కనిపించే కీళ్ల వాతాన్ని అదుపులో ఉంచుతుంది.
- కర్బూజా చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. రక్తపోటును నివారిస్తుంది.
- కర్బూజా ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. నిద్రలేమిని పోగొడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com