పాలు శరీరానికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది. అయితే కొంత మంది ఉదయాన్నే పాలు తాగుతుంటారు. మరి కొందరు సాయంత్రం తాగుతుంటే.. పాలు తాగకుండా నిద్రకు ఉపక్రమించని వారు మరికొందరు ఉంటారు. పాలు తాగే సమయంపై చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసేటప్పుడు పాలు తాగితే న్యూట్రియెంట్స్ అంది ఇమ్యూనిటీ పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఇక రాత్రి పడుకునే ముందు పాలు తాగితే పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ విడుదలై మంచి నిద్ర పడుతుందట. అలాగే నెర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం పాలు సాయంత్రం పూట తాగాలని అంటుంటారు. ఇక పాలలో గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్, విటమిన్-డి, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం వంటివి ఉంటాయి. పాలు తాగితే ఎముకలు బలంగా ఉంటాయి. బీపీ నార్మల్ గా ఉంటుంది.