పల్నాడులో స్కూల్ పిల్లల్ని పోలీస్ స్టేషన్‌లో ఉంచిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీకి చెందిన పోస్టర్లు, ఫ్లెక్సీలను చించారని మైనర్లను రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవ్వగా.. జనసేనాని స్పందిస్తూ 10-15 ఏళ్ల మైనర్లను స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం పిల్లల్ని కూడా వదలడం లేదంటూ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa