వమాసాలు మోసి కనిపెంచిన తల్లిని ఓ దుర్మార్గుడు హతమార్చాడు. మద్యం మత్తులో డబ్బుల కోసం హింసించి, గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత ఆమెది సాధారణ మృతిగా అందరినీ నమ్మించాడు. అంత్యక్రియల సమయంలో బంధువులను అనుమానం రావడంతో విషయం బట్టబయలైంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఎరాజ్‌పల్లి గ్రామంలో మంజుల (45) తన కొడుకు గంగాప్రసాద్ (19)తో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త ఏడాది కిందట చనిపోయాడు. దీంతో ఆమెకు ప్రభుత్వం నుంచి రైతు భీమా కింద రూ.5 లక్షల ప్రభుత్వ సాయం అందింది. ఇక పదో తరగతి వరకు చదువుకున్న గంగాప్రసాద్ జులాయిగా మారాడు. మద్యానికి బానిసై, ఇంటి పట్టున ఉండేవాడు కాదు. అయితే తల్లికి అందిన రైతుబీమా సొమ్మును తనకు ఇవ్వాలని తల్లిని ఇటీవల తల్లిని అడుగుతున్నాడు. ఈ విషయంపై మంగళవారం రాత్రి మరోసారి తల్లితో గొడవపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న గంగాప్రసాద్ కోపంలో తన తల్లి గొంతు నులిమాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. బుధవారం అందరికీ ఆమెది సహజమరణంగా నమ్మించడంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆమె నోటి నుంచి రక్తం రావడంతో బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో అతడు నేరం అంగీకరించాడు.