చిత్తూరు: రేణిగుంట మండలంలో పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్దకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రేణిగుంటలో 8 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 1085 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 1076 మంది పరీక్ష రాశారు. 9 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని ఎంఈవో ఇందిరాదేవి తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa