ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు(72) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం మృతిచెందారు. పాత నాగూరు నియోజకవర్గం నుంచి 1989-94 కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. మాజీ మంత్రి, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి చంద్రశేఖర్ రాజు మామ అవుతారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
2014లో శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కోడలు పాముల పుష్పశ్రీవాణి వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2018లో వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు చంద్రశేఖర్ రావు. 2019 ఎన్నికల సమయంలో తిరిగి సొంతగూటికి వచ్చారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కురుపాం నుంచి పుష్ప శ్రీవాణి మళ్లీ గెలుపొందారు. అనంతరం జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం, గిరిజనశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆమె తన పదవిని కోల్పోయారు.