తనను వేధించిన వ్యక్తిని ఓ యువతి కర్రతో చితకబాదింది. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులో పనిచేస్తున్న యువతి గురువారం రాత్రి బైక్ పై ఇంటికి వెళ్తుండగా ఓ పోకిరి ఆమెను అడ్డగించాడు. ఆమెను వేధింపులకు గురి చేశాడు. అయితే ఆ అమ్మాయి అతనికి భయపడలేదు.
కర్రతో చితకబాది అతనికి బుద్ధి చెప్పింది. కాలితో తన్నింది. ఆడవాళ్లు ఎలా కనిపిస్తున్నారంటూ చితకబాదింది. దండం పెడతా వదలమని వేడుకున్నా విడిచిపెట్టలేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.