నాటుసారా నిర్మూలనకు స్వయంగా రంగంలోకి దిగిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. బాపట్ల మండలం వెదుళ్ళ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న బేతపూడి గ్రామంలో శుక్రవారం జరిగిన కార్డెన్ సెర్చ్ ఎస్పీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో రెండు నెలల్లో నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎస్పీ అన్నారు. నాటుసారా తయారీ, క్రయవిక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్డెన్ సెర్చ్ లో నాటుసారా తయారీకి ఉంచిన 1500 లీటర్లు బెల్లం ఉట ద్వంసం చేశామన్నారు. 70 కిలోల బెల్లం, 20 లీటర్లు నాటుసారా స్వాధీనం చేసుకొని 5 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఎవరైతే నాటుసారా తయారు చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని, తరచూ నాటుసారా తయారీ క్రయవిక్రయాలకు పాల్పడుతున్న వారిపై సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేస్తామని, అవసరమైతే వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడానికి కూడా వెనుకాడబోమని తెలియజేసినారు.
రాబోయే రోజుల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేదిలేదని వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. నాటుసారా తయారీ, క్రయ విక్రయాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు లేదా "ఎస్పీ బాపట్ల హెల్ప్ లైన్ నెంబర్ 8333813228" తెలియజేయాలని ప్రజలను కోరారు.
ఈ కార్డెన్ సెర్చ్ లో బాపట్ల జిల్లా ఎస్పీ గారితో పాటుగా బాపట్ల డిఎస్పీ. శ్రీనివాసరావు , సెబ్ ఏ ఈ ఎస్ ఎస్. నరసింహరావు , బాపట్ల రూరల్ సర్కిల్ సిఐ శ్రీనివాస రెడ్డి , సెబ్ సిఐ. శ్రీనివాసరావు, వెదుళ్ళపల్లి, బాపట్ల రూరల్, కర్లపాలెం చందోలు పోలీస్ స్టేషన్ ఎస్సై లు, సిబ్బంది పాల్గొన్నారు.