విధుల్లో నిర్లక్ష్య వైఖరి, ప్రజా సమస్యల పరిష్కారంలో భాధ్యతాయుతంగా వ్యవహరించని తీరు పై గురువారం కౌన్సిల్ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు శుక్రవారం 6వ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ అంగడి రాజేష్ ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ అదేశపు జారీ చేశారు.
గురువారం రాజేష్ పై కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ల ఫిర్యాదుపై కమిషనర్ కీర్తి స్పందించి శానిటరీ ఇన్ స్పెక్టర్ రాజేష్ స్థానంలో భవాని బాబుకి విధుల కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.