ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొట్టిపాడు సెంట్రల్ బ్యాంకులో చోరీకి ప్రయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 30, 2022, 10:40 AM

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు సెంట్రల్ బ్యాంకులో చోరీకి అర్ధరాత్రి దుండగులు ప్రయత్నించారు. బ్యాంకుకు ఉన్న తాళాలను యంత్రం సహాయంతో కోసి లోపలకి వెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. బ్యాంకులో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో చూసి ఆ వైర్లను కట్ చేశారు. అయితే లాకర్లను తెరిచే ప్రయత్నం చేసినా అవి ఓపెన్ అవలేదు. బ్యాంకులో ఉన్న డాక్యుమెంట్స్ ని వెతికి కిందపడేసారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. జాగిలాలతో వెతికే ప్రయత్నం చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com