ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో నారా లోకేష్ పై దాడిని ఖండించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మల పూడి గ్రామంలో కామాంధుల చేతిలో అత్యాచారం, హత్యకు గురైన తిరుపతమ్మ మృతదేహాన్ని సందర్శించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పై వైసిపి శక్తులు రాళ్లతో దాడికి దిగడం దుర్మార్గమని వైసిపి రౌడీ ముకల దుశ్చర్యలను తీవ్రంగా ఖండించారు.
టీడీపీ శ్రేణులు పై రాళ్లు రువ్వుతుంటే నియంత్రించలేని స్థితిలో రాష్ట్ర పోలీసులు ఉన్నారా..? పోలీసులు చోద్యం చూస్తున్నట్లుగా ఉన్నదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 800 మహిళలపై దాడి జరిగింది ఒక్క బాధిత కుటుంబాన్ని అయినా న్యాయం చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, మహిళల మానప్రాణాలకు రక్షణ కల్పించలేని వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించిన ప్రతిపక్ష నేత పై పిరికిపంద చర్యగా పరోక్ష దాడులు చేయడం దుర్మార్గమని లోకేష్ బాబు పై రాళ్ల దాడికి దిగిన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తాతయ్య డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మేక వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, కౌన్సిలర్లు కన్నెబోయిన రామలక్ష్మి, పేరం సైదేశ్వర రావు, సామినేని మనోహర్, నగరి కంటి వెంకటి, గొట్టె నాగరాజు, గెల్లా సంధ్యారాణి, సూర్యదేవర ఉషారాణి, కర్ణ శాంతకుమారి, షేక్ సిరాజున్, ఇర్రి నరసింహారావు, సంగెపు బుజ్జి, దుగ్గిరాల మహేష్ , కర్ల జోజి, గెల్లా వైకుంఠ రావు, సూర్యదేవర రాంప్రసాద్, షేక్ జాని తదితరులు పాల్గొన్నారు.