చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కీలపట్ల పంచాయతీలో వీఆర్వోపై దాడి చేసిన ఘటనలో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నాగరాజు అనే వ్యక్తి ఓ పని నిమిత్తం విఆర్వో రాజేందర్ కు ఫోన్ చేశాడు. విధులలో నిమగ్నమై ఉన్న రాజేంద్ర ఫోన్ ఎత్తలేకపోయాడు. దీంతో ఆగ్రహించిన నాగరాజు సంబంధిత కార్యాలయం వద్దకు వెళ్లి అందరిముందు దాడి చేశాడని , విధులకు ఆటంకం కలిగించాడని రాజేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa