తాడేపల్లి సీఎం జగన్ ఇంటికి కూత వేటు దూరంలో ఒక బాధాకరమైన సంఘటన చోటుచేసుంది. సాక్షి పేపర్ విలేకరిగా ప్రజల్లో తిరుగుతూ... ఒక వయస్సు మళ్ళిన ముసలి వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేసాడు. ఈ సంఘటన మొత్తం ఒక వీడియో రూపంలో బయటికి వచ్చింది. మా భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని వీరు వాపోతున్నారు. దీనిని అడ్డగించినందుకు ఆడ వారిపై చేయీ చేసుకొని ముసలి వాడిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ తరుణంలో ఆ ముసలాయన నన్ను నాగిరెడ్డి చంపబోతున్నాడు, కాపాడండి అని పెద్దగా అరుపులు పెట్టాడు. ఐనను నాగిరెడ్డి ఆగకుండా ఆయనను కొట్టటడం జరిగింది. ఈ వీడియో టీడీపీ పార్టీ నాయకులూ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ... సీఎం జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో పంచాయితీలు చేస్తుంటే, జగన్ రెడ్డి సామాజికవర్గం కావడమే రౌడీయిజానికి లైసెన్స్ గా...జగన్ రెడ్డి పత్రిక సాక్షి విలేకరి పోస్ట్ దందాలకి అర్హతగా నాగిరెడ్డి తాడేపల్లిలో పాల్పడుతున్న దాడులు ఇవి. వృద్ధుడిపై ఎంత అమానవీయంగా నాగిరెడ్డి దాడి చేస్తున్నారో ఒక సారి చూడండి భారతి మేడమ్ గారు అని ఆవేదన వ్యక్త పరిచారు.