తిరుపతి జిల్లా చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహంపై హైకోర్టు స్టే విధించింది. దళిత, గిరిజన నాయకులు ఈనెల 13 వ తేదీ రాత్రి చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పంచాయతీ అధికారులు, తహసీల్దార్, పోలీసులు అక్కడికి చేరుకుని విగ్రహం ఏర్పాటు చేయ డానికి అనుమతి తీసుకోవాలని సూచించారు.
తాము 2012 లోనే అనుమతి తీసుకొన్నామని దళిత, గిరిజన నాయకులు తెలిపారు. మళ్లీ కొత్తగా అనుమతులు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేయడంతో అంబేడ్కర్ ఆశయ పోరాట సమితి నేతలు హైకోర్టుకు వెళ్లారు. టవర్ క్లాక్ వద్దనే అంబేడ్కర్ విగ్రహం ఉంచాలంటూ న్యాయస్థానం స్టే విధించింది.