జగనన్న పాలనలోనే మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధ్యమని పీలేరు మండల వైసిపి ప్రజాప్రతినిధులు తెలిపారు. నవరత్నాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇస్తున్న సున్నా వడ్డీ చెక్కుల పంపిణీ కార్యక్రమం, స్థానిక సిఎల్ఆర్సి భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపిపి కంభం సతీష్ కుమార్ రెడ్డి, జడ్పిటిసి ఏటి రత్నశేఖర్ రెడ్డి, సర్పంచ్ డాక్టర్ షేక్ హబీబ్ బాష, మార్కెట్ కమిటీ చైర్మన్ కడప గిరిధర్ రెడ్డి, గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ నాగరాజమ్మ, జడ్పీ కోఆప్షన్ సభ్యులు షామియానా షఫీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. జగనన్న పాలనలోనే మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతొందని అన్నారు. పీలేరు మండల పరిధిలొ 1449 డాక్రా గ్రూపుల మహిళలు రూ. 3. 10 కోట్లు సున్నా వడ్డీ చెక్కులను అందుకున్నారని చెప్పారు.
అన్నమయ్య జిల్లాలోనే అత్యధికంగా సున్నా వడ్డీ రాయితీ చెక్కులను పీలేరులో పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతి మహిళా గ్రూపు బ్యాంకుల్లో రుణ సౌకర్యం పొంది, వాయిదా పద్ధతిలో తిరిగి బ్యాంకులకు చెల్లించాలని తెలిపారు. రుణాలను మహిళలు సక్రమంగా వినియోగించుకుని మీ కుటుంబాలను ఆర్థిజంగా అభివృద్ధి చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి హరిత వెంకటరమణ, మాజీ ఎంపిపి మహితా ఆనంద్, ఎంపి పిఆర్వో ఉదయ్ కుమార్, ఎంపిటిసిలు కంభం నరసింహా రెడ్డి, అమర్నాథ రెడ్డి, కావలిపల్లి సర్పంచ్ ఆవు రెడ్డమ్మ లోకనాథ్ రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర చక్రధర్, నాగరాజ నాయక్, చినబాబు, ఎంపిడిఓ సిహెచ్ నారాయణ నాయక్, వెలుగు ఏరియా కోఆర్డినేటర్ రూతు, ఏపీఎం లక్ష్మణ్ రెడ్డి, సిసిలు, సంఘమిత్రలు, వెలుగు మహిళలు సిబ్బంది పాల్గొన్నారు.