ముంబైలో శ్రీవారి ఆలయానికి దాదాపు రూ.500 కోట్లు విలువైన 10 ఎకరాల భూమిని మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. శనివారం తిరుమల వచ్చిన మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. శ్రీవారి ఆలయానికి కేటాయించిన భూమి పత్రాలను అందజేశారు. ఈ ఆలయం నిర్మాణ వ్యయం మొత్తాన్ని భరిస్తామని రేమాండ్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ సరిన్ తెలిపారు.