ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మహిళల పట్ల ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. హత్యలు, మానభంగాలు , లాంటివి రాష్ట్రంలో ఏదో ఒక మూల నుండి రోజుకి ఒకటి వెలుగు చూస్తుంది. దీనికి కారణం ప్రభుత్వ వైఫల్యమా...? లేక ప్రజల అజాగర్త అనేది అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఐతే, జరుగుతున్నా నేరాలపై హోమ్ మంత్రి తానేటి వనిత స్పందిస్తూ... బిడ్డలా పట్ల తల్లి తీసుకోవలసిన జాగర్తలు తీసుకుంటే, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసిన అవసరం లేదు, అంతే కానీ మనం పిల్లలికి ఎలా ఉండాలో చెప్పకుండా ఏదైనా,సంభవించినప్పుడు ప్రభుత్వాన్ని, పోలీస్ వారిని అనడం సరైన పద్దతి కాదు అని మీడియా ముఖంగా తెలియచేసారు. దీనిపై స్పందించిన టీడీపీ నాయకులూ అయ్యన్నపాత్రుడు ... తల్లులు పట్టించుకోకుండా వదిలేసి, మా పిల్లలు రేప్ అయ్యారు అంటే, మేమేమి చేస్తాం ? మీరు పట్టించుకోకుండా, మా జగన్ ను, మా ప్రభుత్వాన్ని అంటారా ? అంటున్న మంత్రిగారు.. ఇది ఈ రాష్ట్రంలో పరిస్థితి. అని ట్వీట్ చేసారు.