అమెరికాలోని చికాగో నగరంలో కాల్పులు కలకలం రేపాయి. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో 8 మంది మృతిచెందారు. మరో 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. సౌత్ కిల్‌ప్యాట్రిక్, బ్రైటన్ పార్క్, సౌట్ ఇండియానా, నార్త్ కెడ్జి అవెన్యూ, హోమ్‌బోల్ట్ పార్క్ లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం సాయంత్రం సౌత్ కిల్‌పాట్రిక్‌లో ప్రారంభమైన ఈ కాల్పులు శనివారం కూడా కొనసాగాయి. 69 ఏళ్ల వృద్ధుల నుంచి అన్ని వయస్సుల వారు మృతుల్లో ఉన్నారని అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa