తిరుమలలో ఐదేళ్ల బాలుడు గోవర్దన్ కిడ్నాప్ కు గురయ్యాడు. గుర్తు తెలియని మహిళ భాలుడిని ఎత్తుకెళ్లింది. ఆదివారం సాయంత్రం 5.30 నిమిషాలకు బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. ఓ మహిళ బాలున్ని తీసుకెళ్తునట్టు సీసీటీవీలో రికార్డయ్యింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అన్ని స్టేషన్లు, చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. 12 గంటలుగా బాలుని ఆచూకీ కోసం టీంలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ కు గురైన బాలుడి స్వస్థలం తిరుపతిలోని దామినీడు ప్రాంతం. బాలుడి ఆచూకీని కొన్ని గంటల్లో కనిపెడతామని పోలీసులు తెలిపారు.