చీపురుపల్లి రైల్వేస్టేషన్ కి ఆనుకొని ఉన్న రోడ్డు కం రైల్వే బ్రిడ్జ్ కండిషన్ బాగోలేనందున రాజాం నుండి చీపురుపల్లి కి, మరియు చీపురుపల్లి నుండి రాజాం వైపు నకు భారీ వాహనాలు మరియు బస్సులు రాకపోకలు నిలుపుదల చేయు నిమిత్తం రోడ్డుకి 8 అడుగుల ఎత్తులో రెండు వైపులా ఐరన్ హైట్ గేజ్ లను రైల్వే శాఖ వారి ద్వారా ఏర్పాటు చేయడమైనది. ఏ ప్రమాదం జరగకుండా ఉండు నిమిత్తం బారీ వాహనాలు మరియు బస్సులు రాకపోకలు ఈ మార్గం గుండా తాత్కాలికంగా ఆపుతున్నట్లు అధికారులు ప్రజలకు తెలియజేసారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించగలరని చీపురుపల్లి ఎస్. ఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa