సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌తో చెన్నై ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగుతో సెంచరీ మిస్సయ్యాడు రుతురాజ్ దిగ్గజ ఆటగాడు సచిన్ రికార్డును సమం చేశాడు.ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చాడు చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. 57 బాల్స్ లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 99 పరుగులు చేశాడు. ఒక్క పరుగుతో సెంచరీ మిస్సయ్యాడీ యువ బ్యాట్స్‌మెన్. ఈ సీజన్ లో రుతురాజ్ కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. అతడి మెరుపులతో చెన్నై ఇరవై ఓవర్లలో 202 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ పై పదమూడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నది.
ఈ సీజన్‌లో మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది. ఈ మ్యాచ్‌తో రుతురాజ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును రుతురాజ్ సమం చేశాడు. సచిన్ ఐపీఎల్‌ల 31 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగుల మార్కును చేరుకున్నాడు. సరిగ్గా 31 ఇన్నింగ్స్‌లలోనే రుతురాజ్ కూడా ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం. గత సీజన్‌లో 16 మ్యాచుల్లో 635 పరుగులతో టాప్ సోరర్స్‌లో ఒకరిగా రుతురాజ్ నిలిచాడు. దాంతో ఆరు కోట్లను చెన్నై అతడిని రీటెయిన్ చేసుకున్నది. ఈ సీజన్‌లో 9 మ్యాచుల్లో 237 పరుగులు మాత్రమే చేశాడు.