బీహార్‌లోని సుపాల్ జిల్లాలో సోమవారం ఉదయం వేగంగా వచ్చిన ట్రక్కు ఇంట్లోకి దూసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.మృతులను అనిల్‌రామ్ కుమారుడు, కుమార్తె శ్రవణ్‌కుమార్ (5), సరస్వతి కుమారి (7)గా గుర్తించారు. అతని భార్య రంజనా దేవి, 3 ఏళ్ల కుమారుడు లక్ష్మణ్ కుమార్ తీవ్ర గాయాలతో సుపాల్ సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ట్రక్కు డ్రైవర్, సహాయకుడు పరారీలో ఉన్నారు.బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో అతివేగంగా వెళ్తున్న కారు ఢీకొనడంతో పిల్లలతో సహా 20 మంది గాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa