కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం నుండి పశ్చిమ బెంగాల్లో మూడు రోజుల పర్యటనలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, బిజెపి కార్యక్రమాలకు హాజరుకానున్నారు మరియు పార్టీ రాష్ట్ర శాఖలో కొనసాగుతున్న అంతర్గత పోరును కూడా ప్రస్తావించనున్నారు.మే 4 సాయంత్రం కోల్‌కతా చేరుకోనున్న షా, మే 5న హింగల్‌గంజ్‌లో జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం సిలిగురిలో పర్యటించి రైల్వే మైదాన్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం వివిధ ప్రజాసంఘాల నేతలతోనూ సమావేశం కానున్నారు.మే 6న టిన్ బిఘాలో జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి హాజరవుతారు. మధ్యాహ్నం కోల్‌కతాలో బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఆఫీస్ బేరర్లతోనూ ఆయన సమావేశమవుతారు.అనంతరం విక్టోరియా మెమోరియల్‌లో జరిగే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యక్రమానికి హాజరైన షా రాష్ట్ర రాజధానిలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శిస్తారు.