రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నరసరావుపేట మండలం రావిపాడు కు చెందిన బోడపాటి సుబ్బారావు( 57), ముప్పాళ్ళ మండలం పలుదేవర్ల పాడు గ్రామానికి వెళ్లి వస్తుండగా ఇస్సపాలెం రావిపాడు బైపాస్ రోడ్డులో వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన సుబ్బారావు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.