ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్‌గా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ శాసన మండలి చీఫ్ విప్ గా మరోసారి నియమితులైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారికి వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలియచేసారు. మంగళవారం ఆయన ఉమ్మారెడ్డిని కలిశారు. సుదీర్ఘకాలం చట్టసభల్లో సభ్యుడిగా వ్యవహరిస్తూ అపారమైన రాజకీయ అనుభవం గడించిన ఆయన సేవలు నిరుపమానమంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.