భారత దేశంలో కుల వివక్షత, వర్ణ విభేదాలు లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది బసవేశ్వర మహర్షి అని జాయింట్ కలెక్టర్ కె. శ్రీనివాసులు అన్నారు. మంగళవారం బసవేశ్వర మహర్షి జయంతి సందర్భంగా బాపట్ల కలెక్టరేట్ లోని స్పందన హాల్ లో ఆయన చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారత దేశంలో ప్రజలను చైతన్య పరచడానికి బసవ వచన సాహిత్యం రచించారన్నారు. బసవేశ్వర మహర్షి 64 లక్షల వచనాలు రచించారన్నారు. తన రచనలు కర్ణాటక రాష్టాన్నీ దాటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చారన్నారు. భారత దేశంలో ప్రజలు చేసే పనే దేవుని తో సమానంగా చూడాలని ఆయన చెప్పారన్నారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వర మహర్షి ని స్పూర్తిగా తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డి. పి. ఆర్. ఓ టి. మోహన్ రాజు, తహసీల్దార్ గోపాలకృష్ణ, రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.