తక్కువ ధరలో మనకు అందుబాటులో ఉండే పళ్లలో సపోటా కూడా ఒకటి. దీని రూపు కు, రుచికి సంబంధమే ఉండదు. చూడటానికి, పట్టుకోవటానికి కొంత ఇబ్బందికరంగా ఉండే సపోటా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారుండరు. సపోటా వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
--- వీటిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కనుక ఈ పండును తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
--- ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
--- ఈ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. కనుక నొప్పులు, వాపుల సమస్యలతో బాధపడుతున్నవారు ఈ పండ్లను తింటే ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
--- ఈ పండ్లలో ఉండే పొటాషియం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీనివల్ల హైబీపీ తగ్గుతుంది.
--- సపోటా పండ్లలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. మన శరీరంలో హాని చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తుంది. దీని వల్ల క్యాన్సర్, డయాబెటిస్ వంటి సమస్యలు రావు.
--- గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఈ పండ్లను తింటే అటు తల్లికి.. ఇటు బిడ్డకు ఎంతో మేలు జరుగుతుంది.