రాగల 2 రోజుల్లో ఏపీలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ఠంగా 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
పల్నాడు జిల్లాకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పిడుగు హెచ్చరికలు జారీ చేసింది. మాచర్ల, రెంటచింతల, గురజాల, దాచేపల్లి, వెల్దుర్తి, దుర్గి, కారెంపూడి, పిడుగురాళ్ల, బొల్లపల్లి మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని చెప్పింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని తెలిపింది.