ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమైన పది పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా కొనసాగుతున్నాయి. ఇటీవల జిల్లాలోని పది పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, పోలీసులచే గస్తీ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల్లోకి ఇతరులను అనుమతించడంలేదు. అంతేకాకుండా పరీక్ష విధులకు హాజరయ్యే ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందికి సెల్ఫోన్లు అనుమతించడంలేదు.