ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ , ప్రజలకి కష్టం వస్తే, మన ప్రభుత్వం వచ్చాక చేస్తాము అని చెప్పిన పార్టీలకి అతీతంగా జనసేన వ్యవహరిస్తోంది అనే చెప్పాలి. కార్యకర్తలకి అండగా ఉండటంలో ఇప్పటినుండే బీజం వేస్తుంది. ఎక్కడ కార్యకర్త కుటుంబానికి కష్టం వచ్చిన స్థానిక జనసేన నేతలు వెళ్లి పరామర్శించి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ధర్మవరం మండలం దర్శనమల గ్రామానికి చెందిన బోయ నరేంద్ర, బోయ రామంజి ప్రమాదవశాత్తు బైక్ యాక్సిడెంట్ కు గురై మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన ఇంచార్జి చిలకం మధుసూదన్ రెడ్డి స్వయంగా వారి స్వగృహాలకి వెళ్లి వారి కుటుంబాలని పరామర్శించి వారి కుటుంబాలకి 20వేల రూ.ఆర్థిక సహాయం చేశారు.