గత ప్రభుత్వం ఐన టీడీపీ చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన బిల్లులను వైసీపీ ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోంది.. ఈ కారణంతోనే ఇప్పటివరకూ ఇబ్బందులు వచ్చాయి అని పంచాయతీ శాఖ మంత్రి అన్నారు. అలానే .... వాటిని అధిగమించి ఆ బకాయిలు చెల్లిస్తున్నాం. శాఖ పరిధిలో చెల్లించాల్సిన బిల్లులన్నింటినీ నెలరోజుల్లో పూర్తిగా చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరిలో.. గ్రామాల్లో జరిగిన, జరుగుతున్న భవన నిర్మాణ పనులు, రోడ్డు పనులకు సంబంధించి దాదాపు రూ.1,900 కోట్ల బకాయిలను చెల్లించనున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే, వాటి గురించి మాట్లాడకుండా అరకొరగా ఉండే లోపాల గురించే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు జనాలను బాదుతాడా, లేదంటే జనమే ఆయనను బాదుతారో చూద్దాం అని ప్రస్తుత ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తెలియచేసారు.