రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ,జనసేనతో పాటు బీజేపీ కూడా కొంత మేరకు ఫలితం సాధించెనే చెప్పొచ్చు. ప్రజలలో తమ ఉనికిని చాటుకునేందుకు రాష్ట్ర బీజేపీ ముందడుగు వేస్తుంది అంటే నమ్మక తప్పదు. రాజయలసీమలో రణభేరి లాంటి కార్యక్రమాల వలన కొంత వరకు మైలేజ్ సాధిచిందనే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో, వస్తున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ. నడ్డా తో సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీపరంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పలు అంశాలపై రాష్ట్ర బీజేపీ నాయకులూ చర్చించడం జరిగింది.