రాష్ట్రంలో పడవ తరగతి పరీక్షలు జరుగుతుండటం అందరికి తెలిసిందే. ఐతే పరీక్షకి సంభందించిన పేపర్ ఇప్పటికే రెండు సార్లు లీక్ అవ్వడం వలన విద్యార్థుల్లో ఆందోళన కలుగుతుంది. ఈ సందర్భంగా ఇక నుండైనా ఎలాంటి దుశ్చర్యలు జరగకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న అన్ని కేంద్రాలను విద్యాశాఖ ‘నో ఫోన్’ జోన్లుగా ప్రకటించింది. దీంతో పాటు టెన్త్ పరీక్షలను సజావుగా పూర్తి చేసేందుకు జాగ్రత్తలు సూచిస్తూ డీఈవోలకు ఆదేశాలు జారీచేసింది. స్మార్ట్ వాచ్‌లు, డిజిటల్ వాచ్‌లు, కెమెరాలు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లో అనుమతించకూడదని, ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. సిబ్బంది లేదా అభ్యర్థుల వద్ద పరీక్ష కేంద్రం ప్రాంగణంలో ఏదైనా ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరం గుర్తిస్తే వెంటనే జప్తు చేయాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.