పెళ్లిలో జరిగే కొన్ని సంఘటనలు అతిథులను షాక్‌కు గురి చేస్తాయి. అనుకోకుండా జరిగే ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఓ పెళ్లిలో అంతా హడావుడిలో ఉండగా అనుకోని ఘటన జరిగింది. వధువు ప్రియుడు వచ్చి, అందరూ చూస్తుండగానే ఆమె మెడలో దండ వేశాడు. ఆపై నుదుట సింధూరం దిద్ది తమకు పెళ్ళి అయిపోయిందని అరిచాడు. ఈ హఠాత్పరిణామం తర్వాత ఒక్కసారిగా వారంతా యువకుడిపై దాడికి పాల్పడ్డారు. అనేక మలుపులు తిరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బీహార్‌లోని పాట్నాలో ఎరాయ్ గ్రామంలో ఓ జంటకు పెద్దలు వివాహం నిశ్చయించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెళ్లి జరపడానికి అంతా ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి వేడుకలో భాగంగా వధూవరులిద్దరూ దండలు మార్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ తరుణంలో హఠాత్తుగా అక్కడికి ఓ యువకుడు దూసుకొచ్చాడు. వరుడు చేతిలోని దండ లాక్కుని, వధువు మెడలో వేశాడు. ఆ వెంటనే పక్కనే ఉన్న సింధూరం చేతిలోకి తీసుకుని, యువతి నుదుట దిద్దాడు. ఈ పరిణామంతో అంతా అవాక్కయ్యారు. ఆ తర్వాత ఆ యువకుడు వధువు ప్రియుడని తెలుసుకున్నారు. ఒక్కసారిగా అంతా పట్టరాని ఆగ్రహంతో అతడినిపై సామూహిక దాడి చేశారు. అతడిని కాపాడేందుకు వధువు విఫలయత్నం చేసింది. చివరికి ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వరుడు కుటుంబికులు పెళ్లి రద్దు చేసుకుని, ఇంటికి వెళ్లిపోయారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఆ యువకుడిని పోలీసులు పంపేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa