పది, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో టాప్-10 మార్కులు సాధించిన విద్యార్థులకు హెలికాప్టర్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ప్రకటించారు. పిల్లలను మరింతలా ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలకు మరింత పదును పెట్టేందుకు ఈ రైడ్ దోహదం చేస్తుందని చెప్పారు.