సమాజంలో ప్రతి శాఖ నందు మంచి మరియు చెడు మనస్వత్వాలు కలిగిన వారు ఉండటం సహజం. కానీ అదే పోలీస్ శాఖలో మొదట దేశానికీ ఎంతో చెయ్యాలి, న్యాయాన్ని కాపాడాలి అని ఎన్నో ఆశలతో ఉద్యోగం లోకి అడుగుపెడతారు చాలామంది. కానీ రాజకీయ నాయకుల వత్తిడి వలన కానీ ఇతర కారణాల వలన కానీ , ఎక్కువ మంది చెడుని ప్రోత్సహించే వారు ఎక్కువయ్యారు. కానీ మంచి కొంతమందిలో ఐన బ్రతికి ఉంటుంది అనేదానికి నిదర్శనం కొంత మంది పోలీసులు. తాజాగా అలంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే. ....తూర్పు గోదావరి జిల్లా, మోరంపూడి ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లో ఓ తల్లి తన బాలుడితో వెళ్తున్న సమయంలో పవర్ కట్ కారణంగా ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోయింది, ఆ అపార్ట్మెంట్ కు జనరేటర్ సదుపాయం లేకపోవడంతో తల్లి, బాలుడి లిఫ్ట్ లో చిక్కుకొని భయాందోళనకు గురయ్యారు. మోరంపూడి సెంటర్ నందు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ రవణమ్మ సదరు విషయం తెలుసుకుని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని టెక్నీషియన్ ను పిలిపించి లిఫ్ట్ డోర్లు తెరిపించి తల్లీబిడ్డలను సురక్షితంగా రెస్క్యూ చేయడం జరిగింది.