ఏపీ రాష్ట్రంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రేపు కడప జిల్లాలో భూములు, మౌలిక వసతులను పరిశీలించనున్న కేంద్ర బృందం.. కొప్పర్తిలో ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఏపీఐఐసీ అంచనా వేస్తోంది. కొప్పర్తిలో ఇప్పటికే స్పిన్నింగ్, అపారెల్, టెక్స్‌టైల్ పరిశ్రమలు ఉండగా.. పీఎం మిత్ర పార్కు ఏర్పాటైతే గనుక 3 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.