ఏపీ లో 108 సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మొన్న రుయా ఆస్పత్రి ఘటన మరువకముందే.. తిరుపతి జిల్లాలో మరో ఘటన జరిగింది. నాయుడుపేట నుంచి రెండేళ్ల చిన్నారి అక్షయ(2) మృతదేహం తీసుకెళ్లేందుకు 108 సిబ్బంది నిరాకరించడంతో.. ప్రైవేట్ అంబులెన్స్‌లో తరలించే స్తోమత లేక చిన్నారి మృతదేహాన్ని తండ్రి బైక్‌పై తీసుకెళ్లాడు. నిన్న ప్రమాదవశాత్తు గ్రావెల్ గుంతలో పడి అక్షయ నీట మునగగా.. ఆస్పత్రికి తరలించేలోగా చనిపోయింది.