బనగానపల్లె నియోజకవర్గంలోని కోవెలకుంట్లలో వెలసిన శ్రీదేవి , భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సుదర్శన హోమం క్రతువును శుక్రవారం శాస్త్రోక్తంగా చేపట్టారు. కరోనా విపత్తు కారణంగా రెండేళ్ల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించలేదు. కాగా ఈనెల 11వ తేదీ నుంచి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పండితులు హోమాలతో పాటు అభిషేకాలు, మహా పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa