అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆరేళ్ల బాలికపై అత్యాచార గటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. ఆ చిన్నారి బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా వుంటుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం శాఖ మంత్రి వర్యులు కే. వి. ఉషాశ్రీచరణ్ తెలియజేశారు. విశాఖపట్నంలోని కేజీ హెచ్ ఆస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధిత బాలికను అధికారులు మహిళా కమీషన్ సభ్యులతో కలిసి మంత్రి ఉషాశ్రీచరణ్ పరామర్శించి కేజీహెచ్ డాక్టర్లను బాలిక ఆరోగ్య పరిస్థితి పై ఆరాతీసారు.
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ అత్యాచారానికి గురైన బాలికకు మెరుగైన చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై పోలీస శాఖ సత్వరమే స్పందించింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడికి చట్టపరంగా కఠినమైన శిక్ష పడేలా చేస్తామని రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై ప్రతి పక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలని తెలియజేశారు. ఖచ్చితంగా దిశా చట్టం ద్వారా బాధితుడిని కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు.