పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు, టీవీ ప్రముఖుడు ఆమిర్ లియాకత్ మూడో పెళ్లి కథ కూడా కొన్ని నెలలకే ముగుస్తోంది.49ఏళ్ల ఆమిర్ గత ఫిబ్రవరిలో 18ఏళ్ల సయిదా దానియా షాను పెళ్లి చేస్తున్నారు.అయితే, ఇప్పుడు ఆమిర్ నుంచి విడాకులు కోరుతూ దానియా కోర్టును ఆశ్రయించారు.ఆమిర్‌పై దానియా గృహహింస ఆరోపణలు చేశారు. తమ పెళ్లిని రద్దు చేయాలని ఆమె కోర్టును కోరారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ తహరీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)లో ఆమిర్ సభ్యులు.
ఆమిర్‌తో తాను విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా దానియా షా వెల్లడించారు. కోర్టులో విడాకులకు అర్జీ పెట్టినట్లు ఆమె చెప్పారు. ఆయన గురించి చాలా విషయాలు మీకు చెప్పాలని ఆమె వీడియోలో అన్నారు.తనపై ఆమిర్ చాలా క్రూరంగా ప్రవర్తించారని దానియా ఆరోపించారు. ''నన్ను మూడేసి రోజులు గదిలోనే పెట్టి లాక్ చేసేవారు. తిండి కూడా పెట్టేవారు కాదు''అని ఆమె చెప్పారు.తుపాకీతో కాల్చేస్తానని ఆమిర్ బెదిరించారని దానియా ఆరోపించారు. గొంతు కూడా ఒకసారి నొక్కేశారని ఆమె అన్నారు.''నాకు, నా సోదరుడికి, నా కుటుంబానికి ఏదైనా జరిగితే.. దానికి కారణం మాత్రం ఆమిరే''అని ఆమె అన్నారు.
నన్ను ఒక చిన్న గదిలో లాక్‌చేసేవారు. ఆ గదిలోనే బంధించి కొట్టేవారు. నన్ను, నా కుటుంబాన్ని బెదిరించేవారు. ఆమిర్.. దెయ్యం కంటే చెడ్డవారు''అని దానియా వ్యాఖ్యానించారు.దానియా పిటిషన్‌పై జూన్ 7న కోర్టు విచారణ చేపట్టనుంది.దానియా చేస్తున్న ఆరోపణలపై ఆమిర్ స్పందించారు. ఆ ఆరోపణలన్నీ అబద్ధాలేనని, వాటిలో ఎలాంటి నిజాలూలేవని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు.