ఐపీఎల్-2022 సీజన్‌లో కొత్తగా అడుగు పెట్టిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు అదరగొడుతున్నాయి. పాయింట్ల టేబుల్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు జట్లు మంగళవారం రాత్రి తలపడనున్నాయి. కాసేపటిలో జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచింది. బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలుస్తుంది. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలతో లక్నో, గుజరాత్ జట్లు బరిలోకి దిగుతున్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), KL రాహుల్(c), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కరణ్ శర్మ, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa