ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త తిట్టాడని భార్య ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 11:52 AM

భర్త తిట్టాడని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగింది. అరిసిపెరియంగుప్పం గ్రామానికి చెందిన రమ్య(27), పుథునగర్ ​కు చెందిన కార్తికేయన్ ​ఏప్రిల్ 6న ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే భర్త ఇంటికి వెళ్లిన రమ్యకు ఆ ఇంట్లో టాయిలెట్ లేదని తెలిసింది. దీంతో ఆమె తర్వాతి రోజే పుట్టింటికి వచ్చేసింది. తన భర్త టాయిలెట్ కట్టిస్తాడని ఎదురుచూసింది. కానీ అతడు కట్టించలేదు. ఈ విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది.


కార్తికేయన్ రమ్యను దుర్భాషలాడాడు. భర్తతో సాన్నిహిత్యం దెబ్బతినడంతో కుంగిపోయిన రమ్య ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉరితాడుకు వేలాడుతూ కనిపించిన రమ్యను ఆమె తల్లి గమనించింది. పొరుగువారి సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ దురదృష్టవశాత్తు రమ్య మృతిచెందింది. ఈ ఘటనపై రమ్య తల్లి మంజుల పోలీసులను ఆశ్రయించింది. కార్తికేయన్ వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com