ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌ రామ్‌ కన్నుమూత

national |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 12:07 PM

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత పండిట్ సుఖ్ రామ్ (94) కన్నుమూశారు. ఈ నెల 4న ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. దీంతో ఆయనను న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ లో చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన మనవడు ఆశ్రయ్ శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.


హిమాచల్‌ప్రదేశ్‌ లోని మండి లోక్‌సభ స్థానం నుంచి సుఖ్‌ రామ్‌ 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1993-1996 మధ్యకాలంలో కేంద్ర ప్రసారాల వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1963 నుంచి 1984 వరకు మండి ఎమ్మెల్యేగా 5 సార్లు గెలుపొందారు. రాష్ట్ర పశుసంవర్ధక మంత్రిగా పని చేశారు. 1984లో మొదటిసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ ప్రభుత్వంలో జూనియర్‌ మంత్రిగా పని చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com