ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి 106 ఏళ్ల జైలుశిక్ష

national |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 01:25 PM

కేరళలో కన్నకూతురిపై అత్యాచారం చేసిన నిందితుడికి కోర్టు 106 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతే గాకుండా రూ.17 లక్షల జరిమానా విధించింది. మైనర్‌ పై పలుమార్లు అత్యాచారం చేసినందుకు, ఆమెను గర్భవతిని చేసినందుకు, 12 ఏళ్లలోపు బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు, పోక్సో చట్టం కింద అడిషనల్ సెషన్స్ జడ్జి నిందితుడికి జైలు శిక్ష విధించారు.


2017లో బాధిత బాలిక​ గర్భం దాల్చినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు మొదట నిందితుడి గురించి చెప్పలేదు. ఆ తర్వాత కౌన్సిలింగ్ ​కు హాజరైనప్పుడు అసలు విషయం చెప్పింది. తన తల్లి ఇంట్లో లేని సమయంలో తండ్రి అత్యాచారం చేశాడని తెలిపింది. జరిగిన దాని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు తెలిపింది. 2017లోనే మైనర్​ తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి బెయిల్ దక్కలేదు. బాధితురాలికి పుట్టిన బిడ్డ డీఎన్​ఏ టెస్టు ఆధారంగా కోర్టు బాలిక తండ్రిని దోషిగా నిర్ధారించింది. బాధితురాలికి జన్మించిన బిడ్డను సీడబ్య్లూసీ దత్తత తీసుకుందని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com